గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (15:39 IST)

వంటింటి చిట్కాలు: వంటచేసేటప్పుడు తడి చేతులను..?

వంట వండేటప్పుడు చాలామంది తడి చేతులను వేసుకున్న బట్టలకు రాసేసుకుంటుంటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. విడిగా ఒక అంటగుడ్డను పెట్టుకుని దానితో తుడుచుకుంటుండాలి. ఏ రోజుకారోజు ఆ బట్టను వేడినీళ్లతో ఉతికి ఆరేయాలి. 
 
అలాగే గిన్నెలు శుభ్రంచేసే స్పాంజిలను కూడా తరచూ మారుస్తుండాలి. గిన్నెలు తుడుచుకునే గుడ్డను వేడినీళ్ళలో నానబెట్టి ఉతికి ఎండలో ఆరేయాలి. ఇలా చేస్తే ఆ గుడ్డను అంటిపెట్టుకుని ఉన్న సూక్ష్మజీవులన్నీ చచ్చిపోతాయి.

అలాగే డిష్ బ్రష్‌తో సింకును శుభ్రం చేసిన తర్వాత బ్రష్‌కు అంటుకుని ఉన్న సూక్ష్మజీవులు నశింపజేయడానికి యాంటీ బ్యాక్టీరియల్ స్ప్రేని బ్రష్‌పై చల్లాలి. ఈ బ్రష్‌లను డిష్ వాషర్‌లో వేసి కూడా శుభ్రం చేసుకోవచ్చు.