శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 మే 2015 (18:13 IST)

టమోటాలు ఉడికించేటప్పుడు పంచదార, ఉప్పు కలిపితే..?

వంటింటి చిట్కాలు.. కూరల కోసం టమోటాలు ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూను పంచదార, ఉప్పు కలిపితే త్వరగా ఉడుకుతాయి. నిమ్మరసం ఎక్కువగా రావాలంటే నిమ్మపండ్లను 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో వేసి వుంచాలి. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయటపెట్టాలి.
పరమాన్నం మరింత టేస్టీగా ఉండాలంటే, బియ్యాన్ని నెయ్యి వేసి కొంచెం సేపు వేయించి ఆ బియ్యాన్ని రవ్వలా చేసి పరమాన్నం చేయాలి.
 
పూరీ పిండి కలిపేటప్పుడు సాధ్యమైనంత గట్టిగా కలుపుకుంటే పూరీలు నూనె పీల్చుకోవు. పూరీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే, పూరీ పిండికి బాగా మరిగించిన ఆయిల్ కలిపి, పూరీ పిండి తయారు చేసుకోండి. ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు నీళ్లు బదులుగా పాలు వాడితే అన్నం రుచిగా ఉంటుంది.