శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2015 (18:30 IST)

వంటింటి చిట్కాలు.. మృదువైన ఇడ్లీ కోసం.. ఏం చేయాలి?

పొంగల్ రుచి కోసం
తీపి పొంగల్ చేశాక దాన్ని దించే సమయంలో కాస్త పైనాపిల్ రసాన్ని వేసి కలిపితే పొంగల్ చాలా రుచిగా ఉండడమే కాకుండా, పైనాపిల్ వాసనతో చాలా బావుంటుంది.
 
మృదువైన ఇడ్లీ కోసం
ఉప్పుడు బియ్యంతో ఇడ్లీలు వేస్తే చాలా సాఫ్ట్‌గా వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే మీ అందుబాటులో పచ్చిబియ్యమే ఉంటే వాటిని గోరువెచ్చని నీటిలో వాటిని నానబెట్టి పిండిగా రుబ్బితే చాలా మృదువుగా ఉంటాయి.
 
హెల్దీ దోసెల కోసం
దోశెల పిండిలో తురిమిన క్యారెట్, బీట్‌రూట్‌లను వేసి దోసెలుగా వేయడం ద్వారా దోసెలు మృదువుగా, కరకరలాడుతూ వస్తాయి. ఇంకా మృదువుగానూ ఉంటాయి.