గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 20 నవంబరు 2015 (20:03 IST)

డ్రై ఫ్రూట్స్ కొన్నారు... నిల్వచేసుకుని తినాలి కదా... పాడవకుండా...

గృహిణులు ఇంటి పనులతో సతమతమవుతుంటారు. వీటికితోడు వంటింట్లో వస్తువులు పాడయిపోయేవి కన్నయితే... మరికొన్ని వంట చేసేటపుడు విసిగిస్తుంటాయి. కొన్ని తయారు చేసేటపుడు కొన్ని చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 
 
బెల్లం పాకం కానీ, చక్కెర పాకం కానీ మరీ చిక్కగా అయిపోతే దానికి కాసిని పాలు కలిపి స్టౌ మీద పెట్టేస్తే క్షణాల్లో పాకం లేతగా మారిపోతుంది.
 
పాలు విరిగిపోతాయేమోనన్న అనుమానం ఉంటే పాలలో చిటికెడు వంట సోడా వేసి స్టౌ మీద పెడితే అప్పుడవి విరగకుండా ఉంటాయి. 
 
లంచ్ బాక్సులకు పట్టిన మసాలా వాసన వదలకపోతే ఓ బ్రెడ్ స్లైస్‌ను బాక్సులో ఉంచి మూత పెట్టేసి రాత్రంతా అలా ఉంచేయాలి. ఉదయానికల్లా బ్రెడ్ ముక్క ఆ వాసనను పీల్చేసుకుంటుంది. 
 
డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అవి ఉంచిన డబ్బాల్లో కొన్ని లవంగాలు వేసి ఉంచితే సరిపోతుంది.