శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (15:04 IST)

చెమట వాసనతో బాధపడుతున్నారా... ఈ చిట్కాలు పాటిస్తే..?

చెమట వాసనను తొలగించుకునేందుకు ఈ చిట్కాలు మంచి ఫలితాలను పొందవచ్చును. నిమ్మకాయ ముక్కలను కోసుకుని శరీర దుర్వాసన వచ్చే ప్రాంతాల్లో కాసేపు మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కుంటే దుర్వాసన తొలగిపోతుం

చెమట వాసనను తొలగించుకునేందుకు ఈ చిట్కాలు మంచి ఫలితాలను పొందవచ్చును. నిమ్మకాయ ముక్కలను కోసుకుని శరీర దుర్వాసన వచ్చే ప్రాంతాల్లో కాసేపు మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కుంటే దుర్వాసన తొలగిపోతుంది. మెుక్కజొన్న పిండిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే దుర్వాసన పోతుంది.
 
వంటసోడాలో చెమటను పీల్చుకునే లక్షణాలు అధికంగా ఉన్నాయి. బ్యాక్టీరియా వృద్ధిని అరికడుతుంది. వంటసోడాలో కొద్దిగా నీళ్లను కలుపుకుని చెమట అధికంగా పట్టే ప్రాంతాల్లో ఈ నీటితో తుడుచుకుంటే దుర్వాసన సమస్యలు తొలగిపోతాయి. అలానే నిమ్మరసంలో కొద్దిగా బేకింగ్ సోడాను కలుపుకుని ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. 
 
గ్రీన్ టీలో ఉండే టానిన్స్‌ చర్మాన్ని పొడిగా ఉంచుతాయి. చెమట, దుర్వాసన వంటి సమస్యలను నివారిస్తుంది. గోరువెచ్చని నీటిలో రెండు గ్రీన్ టీ బ్యాగులను 10 నిమిషాల పాటు అలానే ఉంచుకుని తీసివేయాలి. ఈ నీటిని చెమట పట్టే ప్రాంతాల్లో రాసుకున్నా లేదా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేసిన శరీర దుర్వాసనలు తొలగిపోతాయి.