గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (18:39 IST)

దోసెలకు నానబెట్టే ముందు.. బియ్యాన్ని వేయిస్తే..?

దోసెలు కోసం బియ్యం నానబెట్టే ముందు, బియ్యాన్ని కొద్దిసేపు వేయించి నానబెడితే దోసె కరకరలాడుతూ వస్తుంది. 
 
* అప్పడాల వంటివి వేయించే ముందు, కొద్దిసేపు ఎండలో ఉంచితే, నూనె ఎక్కువగా లాగకుండా ఉంటుంది. 
 
* కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు తగ్గిపోతుంది.
 
* దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండు మిర్చి, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.
 
* పకోడీ జంతికలు వంటివి చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపిన తర్వాత ఉప్పు వేస్తే, వంటకాలు కరకరలాడుతూ వస్తాయి.