శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2015 (12:10 IST)

కిచెన్ టిప్స్ : పల్చటి మజ్జిగ చిక్కగా మారాలంటే..

చాలా మంది గృహిణిలు సంవత్సరాల తరబడి వంట చేస్తున్నా వారికి వంటింటి చిట్కాలు పెద్దగా తెలియవు. కానీ, వంటే చేసే మహిళలు వంటింటి చిట్కాలను తెలుసుకున్నట్టయితే ఆహారపదార్థాలు వృధాకాకుండా చేయవచ్చు. ఇపుడు కొన్ని వంటింటి చిట్కాలను పరిశీలిస్తే... 
 
మజ్జిగలో నీరు ఎక్కువయితే శనగపిండి కలిపితే చిక్కపడతాయి. రాగి సామానుల మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్త వాటిలా మెరిసిపోతాయి.
 
నిమ్మరసం‌లో కొంచెం ఉప్పు కలిపి వంట గది గట్టుని రుద్దితే జిడ్డు పోతుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలిపితే సరి. పెరుగు పచ్చడి తాళింపులో చెంచా నెయ్యి వేస్తే మరింత రుచిగా ఉంటుంది. ఫ్రిజ్‌లో వాసన వస్తే సబ్బునీళ్ళలో వినేగార్ కలిపి తుడిస్తే వాసన మటుమాయం.