గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (12:38 IST)

వేసవికాలంలో చేపలు, చికెన్, మటన్ కట్ చేసే చాపింగ్ బోర్డును?

వేసవికాలంలో పదార్థాలు పాడవుతున్నాయని.. ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారా? అయితే జాగ్రత్తపడండి. పదార్థాలు పాడవుతున్నాయని ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు.. కొన్ని వండనినీ, కొన్ని వండినవీ ఉంటాయి. అలాంటప్పుడు జాగ్రత్తగా

వేసవికాలంలో పదార్థాలు పాడవుతున్నాయని.. ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారా? అయితే జాగ్రత్తపడండి. పదార్థాలు పాడవుతున్నాయని ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు.. కొన్ని వండనినీ, కొన్ని వండినవీ ఉంటాయి. అలాంటప్పుడు జాగ్రత్తగా అన్నింటికీ మూతలుపెట్టాలి. లేకపోతే ఒకదాని నుంచి మరొకదానికి క్రిములు వ్యాపించి అనారోగ్యాలకు కారణమవుతాయి.
 
అలాగే ఎండాకాలంలో మాంసాహారానికి ఉపయోగించే సామాన్లు, కటర్‌లు వేరుగా ఉంచాలి. ఆహారం వండేటప్పుడు, తినేటప్పుడు నిర్లక్ష్యంగా చేసే కొన్ని పనులు చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కారణమవుతాయి. దాంతో మనకి ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి. సాధారణంగా చికెన్‌, మటన్‌, చేపలు వంటి మాంసాహార పదార్థాలు వండటానికి ఉపయోగించిన చాపింగ్‌ బోర్డునే కాయగూరలు తరగడానికీ ఉపయోగిస్తాం. ఇలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదు. 
 
వీటిని విడిగా వాడాలి. పచ్చి మాంసంలోని బ్యాక్టీరియా తక్కిన పదార్థాలకు వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువ ఉండటంతో అనారోగ్యాలు తప్పవు. కత్తులు మాంసాహారానికి సపరేటుగా ఉండాలి. గ్యాస్ స్టౌను ఏ రోజుకారోజు గ్రీన్ చేయాలి. పనంతా అయిపోయిన తర్వాత ఆ మసిబట్టను వేణ్నీళ్లలో ఉతికి ఆరేయాలి. లేదంటే వాటి నుంచి క్రిములు వృద్ది చెందుతాయి. అవి మన ఆహరాన్ని కలుషితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.