గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By ttdj
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (11:41 IST)

మీకు ఆకలిగా లేదా.. అయితే చింతపండు కొద్దిగా తినండి

చింతపండు అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కొంతమందికి చింతపండు పులుపంటే చాలా ఇష్టం. చింతపండు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. చింతచిగురు, చింతకాయలు కూరలోనూ వాడతారు. అంతెందుకు చింతపండు ఏ

చింతపండు అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కొంతమందికి చింతపండు పులుపంటే చాలా ఇష్టం. చింతపండు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. చింతచిగురు, చింతకాయలు కూరలోనూ వాడతారు. అంతెందుకు చింతపండు ఏ కూరలో అయినా పచ్చడిలో అయినా లేకుంఆ రుచే ఉండదు. రోజూ వాడుకునే చింతపండులో ఉండే ఔషధగుణాలేమిటబ్బా అనుకోవద్దు.. ఇది చూడండి.
 
చింతపండులో టార్టారిక్‌ ఆమ్లం, సిట్రాకామ్లం ఉంటాయి. ఎసిడిటీ ఉన్న వారు దీనిని వాడితే ఇబ్బంది కలుగుతుంది. ఆకలి తక్కువగా ఉన్న వారు చింతపండు రసం ప్రతిరోజూ వాడితే అరుగుదల ఉంటుంది. ఆకలి పుడుతుంది.
 
బెణుకులు, నొప్పులకు చింతపండును బెల్లం కలిపి నూరి పట్టు వేస్తే వాపు కూడా తగ్గుతుంది. ఇలాగే ప్రతిపూజా రాస్తూ ఉండాలి. జ్వరం వచ్చిన తర్వాత కోలుకోవడానికి ముందుగా చింతపండు చారు వేసుకుని భోజనం చేయడం అందరికీ తెలిసిందే. ఇలా చేయడం వల్ల తినే ఆహారం కొంచెం అయినా జీర్ణం అవుతుంది.
 
ఆముదుమును విరేచనకారిగా వాడినప్పుడూ ఆముదపు ప్రభావాన్ని తగ్గించడం కోసం చింతపండును కుంకుడుకాయంత చప్పరించాలి. లేక చింతపండుచారు అయినా త్రాగవచ్చు. చింతపండుతో చారు కాచుకునేటప్పుడు కనీసం ఆ చింతపండు ఆరునెలల క్రితం అయితే మంచిది. చారు కడుపులో దోషాల్ని అరికడుతుంది. వాతాన్ని పోగొడుతుంది.
 
ఊపిరితిత్తులలో నిమ్ము, ఆయాసం, జలుబు, తలనొప్పి తరచు తుమ్ములు రావడం ఉంటే ప్రతిరోజూ జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఇంగువ వంటి దినుసులు వేసిన చారు త్రాగాలి. కీళ్ళనొప్పులు, కీళ్లవాతం, పక్షవాతం, కాళ్ళవాపు, కాళ్లనొప్పులు వంటి వాత వ్యాధులన్నింటిలోను పాత చింతపండుతో కాచిన చారు వాడతారు.
 
సుఖ విరేచనం కావడానికి ప్రతిరోజు రెండు గ్లాసులయినా చింత పండు చారు త్రాగితే మంచిది. నేడు రాష్ట్రంలో అధికంగా గాఫ్లోరోసిస్ వ్యాధి కనబడుతుంది. ఫ్లోరైడ్‌ అనే పదార్థం మనం త్రాగేనీటిలో అధికశాతం ఉంటే ఈ వ్యాధి వస్తుంది. దీని వల్ల ఎముకలు వంగిపోతాయి. విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఎముకలు పెళుసెక్కుతాయి. దీనిని నివారించడానికి చింతపండు బాగా పనిచేస్తుంది.