బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 మే 2015 (17:23 IST)

పండ్లు, కూరగాయల్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే..?

పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చేసే మేలు మరేవీ చేయలేవన్నది అందరికీ తెలిసిందే. తాజా పండ్లు, కూరగాయలు కొనే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి మచ్చలు, ముడతలు లేని పండ్లు కూరగాయల్ని ఎంచుకోవాలి. బాగా పండిన పండ్లు, మంచి కూరగాయలు పరిశుభ్రంగా, చక్కని వాసనతో నిండి వుండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 
 
పండు వాసన మాగినంట్లుంటే వాటిని తీసుకోకూడదు. బంగాళాదుంపలు, యాపిల్స్ వంటివి మినహా చాలా రకాల కూరగాయలు, పండ్ల జీవితకాలం చిన్నగానే వుంటుంది. దీనిని దృష్టిలో వుంచుకుని అవసరం అయిన మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి. తినే ముందు వీటిని శుభ్రంగా ఎక్కువ నీటితో కడగాలి. వీలైతే గోరు వెచ్చని నీళ్లతో కడిగేస్తే వాటిపై దుమ్ముధూళి మలినాలు సులువుగా తొలగిపోతాయి. 
 
క్యాబేజీ, మిలాన్ల వంటి వాటి పైభాగాన్ని తీసివేయాలి. బంగాళాదుంపలు, క్యారెట్లు, యాపిల్స్ వంటి వాటిని చెక్కు తీశాక నీటితో కడగాలి. ఫ్రిజ్ ఉష్ణోగ్రతను గమనిస్తుండాలి. కట్‌చేసిన కూరగాయలు, పండ్లను ప్లాస్టి్ బ్యాగ్స్‌‍లో బిగించి వుంచాలి.