గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (13:14 IST)

కోడిగుడ్లను, బచ్చలికూరను వేడి చేయకూడదు: చికెన్.. మష్రూమ్స్ కూడా?

కోడిగుడ్లను ఉడికించాక కూర లేదా వేపుడును రెండుమూడుసార్లు వేడిచేయడం ద్వారా అందులోని పోషకాలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బాలింతలూ, అనారోగ్యంతో బాధపడేవారు అలా రెండోసారి వేడి

కోడిగుడ్లను ఉడికించాక కూర లేదా వేపుడును రెండుమూడుసార్లు వేడిచేయడం ద్వారా అందులోని పోషకాలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బాలింతలూ, అనారోగ్యంతో బాధపడేవారు అలా రెండోసారి వేడిచేసిన గుడ్డు పదార్థాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే బచ్చలికూరలో ఇనుము, నైట్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. 
 
ఎప్పుడైతే ఈ కూరను వేడి చేస్తామో ఇందులో ఉండే మంచి పోషకాలు కాస్తా హానిచేసేవిగా మారిపోతాయి. వాటి ప్రభావం శరీరంలోని అవయవాల మీద పడుతుంది. ఒకవేళ వేడిగా కావాలనుకుంటే బాగా మరిగిన నీళ్లలో ఈ కూర గిన్నెను కాసేపు ఉంచి తర్వాత తినొచ్చు. అలాగే చికెన్‌ను కూడా వండిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. 
 
అలా చేస్తే ఇందులో మాంసకృత్తులు తొలగిపోతాయి. జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపులో తిప్పడం, అరగకపోవడం, విరేచనాలు వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ఇదేవిధంగా బంగాళాదుంపలు వేడి చేయకూడదు.  పుట్టగొడుగుల్లో అధికంగా మాంసకృత్తులు వుంటాయి. అందుకే వీటిని వండిన తరవాత మళ్లీ వేడి చేస్తే వీటిలోని మాంసకృత్తులు విషపూరితమవుతాయి. అనారోగ్యాలకు దారితీస్తాయి.