బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (11:48 IST)

కరోనావైరస్, విషమంగా మారిన డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోగ్యం

లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ కోవిడ్ 19 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనావైరస్‌తో పాటు డెంగ్యూతో బాధపడుతున్నారని ఆయన కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్, డెంగ్యూ కారణంగా సిసోడియా ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. ఆయన రక్త ప్లేట్‌లెట్లు కూడా పడిపోతున్నాయని కూడా తెలిపింది.
 
సిసోడియా బుధవారం ప్రభుత్వ ఎల్ఎన్జెపి ఆస్పత్రిలో చేరారు. జ్వరం ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటంతో ఆయన చికిత్స కోసం చేరినట్లు తెలిపింది. అయితే తాజాగా సిసోడియాను మెరుగైన వైద్యం కోసం ఎల్ఎన్‌జెపి హాస్పిటల్ నుంచి సాకేత్ లోని మాక్స్ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్లు ఆస్పత్రి హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
 
సెప్టెంబరు 14న మనీష్ సిసోడియా కరోనా బారిన పడ్డారు. దాంతో అప్పటి నుంచి సెల్ప్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం లోని మంత్రివర్గంలో కోవిడ్ 19కు పాజిటివ్‌గా పరీక్షించిన రెండవ మంత్రి మనీష్ సిసోడియా, జూన్‌లో డిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరారు. 12 రోజుల పాటు చికిత్స పొంది జూన్ 26న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.