బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (06:56 IST)

మెట్రో రైలు సిబ్బందిని కూడా వదలని కరోనా.. 28 మందికి పాజిటివ్

కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా లాక్‌డౌన్ అనంతరం సెప్టెంబరు 7 నుంచి బెంగళూరు మెట్రో సేవలు ప్రారంభమైన నేపథ్యంలో... అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ 28 మంది మెట్రో సిబ్బందికి కరోనా సోకింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్సీఎల్) అధికారి ఒకరు మీడియాకు ఈ విషయం తెలియజేశారు. 
 
కరోనా బారిన పడినవారంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. కాగా కరోనాను కట్టడి చేసే ఉద్దేశంతో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలను నిలిపివేశారు. ఇటీవలే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో సేవలు ప్రారంభంకాగా, అక్టోబర్ 4 నుంచి కోల్‌కతా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. 
 
ఈ సందర్భంగా కోల్‌కతా మెట్రో అధికారి ఒకరు మాట్లాడుతూ అక్టోబరు 4 నుంచి తొలుత నావోపాడా- కవి సుభాష్ స్టేషన్‌ల మధ్య మెట్రోసేవలు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు.