గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (12:48 IST)

భారత్‌కు వస్తోన్న కరోనా వ్యాక్సిన్ ఎప్పుడో తెలుసా?

కోవిడ్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వచ్చే వారం నాటికి భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి. కాన్పూర్‌లోని గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీకి చేరే అవకాశం ఉంది. దీనిలో టీకా రెండు, మూడు దశల క్లీనికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. 
 
భారతదేశంలో రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్, స్పుత్నిక్ వీ చివరి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) మరియు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ అనుమతి ఇచ్చినట్లు సావరిన్ వెల్త్ ఫండ్ శనివారం తెలిపింది. 
 
రష్యన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డిస్ కి చెందిన ప్రయోగశాలలను డిజిసిఐ ఇంతకుముందు నిలిపివేసింది. ఈ ట్రయల్స్ లో 1500 మంది పాల్గొనే అవకాశం ఉంది.