గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (13:07 IST)

తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి కుటుంబంలోని నలుగురికి కరోనా

health secretary
తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్‌ కుటుంబంలోని నలుగురికి కరోనా సోకింది. తాజాగా రాధాకృష్ణన్‌ భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్‌-19 టెస్టులో రాధాకృష్ణన్‌కు కోవిడ్‌-19 నెగెటివ్‌గా తేలింది.
 
ఇంతకుముందే రాధాకృష్ణన్‌ మామ, అత్త కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం నలుగురు కరోనా బాధితులు చెన్నైలోని గిండిలో గల కింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రిసెర్చ్‌లో చికిత్స పొందుతున్నారు.
 
తమిళనాడులో సోమవారం కొత్తగా 4,985 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,75,678కు పెరిగింది. ఒక్క చెన్నైలోనే 1,298 మందికి వైరస్‌ సోకింది. 
 
మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కోనసాగుతోంది. పాజిటివ్ కేసులు ప్రస్తుతం 11 లక్షల 55వేలు దాటాయి. గత 24 గంటలలో అత్యధికంగా 37,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా వల్ల కొత్తగా 587 మంది మృతి చెందారు.