గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2015 (10:54 IST)

హాజెల్ కీచ్‌తో ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిసిన యువీ!

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తన కాబోయే భార్య హాజెల్ కీచ్‌తో ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిశాడు. మూడు నెలలుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఇటీవల ఇండోనేషియా నగరం బాలికి వెళ్లింది. గుట్టుచప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా యువీ, కీచ్‌లు ఎంగేజ్‌మెంట్ చేసేసుకున్నారు.

ఆ తర్వాత తమ ఎంగేజ్ మెంట్ ఫొటోను యువీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాజెల్ కీచ్‌తో ముంబై ఎయిర్‌పోర్టులో యువీ తళుక్కున మెరిశాడు. 
 
కాగా.. యువరాజ్ సింగ్ క్రికెట్‌ ఆరంగేట్రంతోనే అదరగొట్టిన అద్భుత ప్రతిభ ఉన్న క్రీడాకారుడు మధ్యలో కాన్సర్ మహమ్మారితో పోరాడి విజయం సాధించిన ధీశాలి. కాన్సర్ నుండి కోలుకున్నాకా 2011 వరల్డ్  కప్‌లో తన సత్తాచాటి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. బౌలింగ్ బ్యాటింగ్ రెండిట్లో అమేజింగ్ ఫర్ఫార్మెన్స్‌తో ది బెస్ట్ ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు.