బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (19:45 IST)

వరల్డ్ కప్ 2015 ఫైనల్ : మరికొన్ని గంటల్లో కివీస్ - ఆసీస్ సంగ్రామం!

ఐసీసీ వరల్డ్ కప్‌లో అతి పెద్ద మ్యాచ్ ఆదివారం జరుగనుంది. అదే వరల్డ్ కప్ ఫైనల్ సంగ్రామం. ఈ మ్యాచ్‌కి ప్రపంచంలోని అతి పెద్ద మైదానాల్లో ఒకటైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజే) ఆతిథ్యమిస్తోంది. గత 2011 (భారత్ - శ్రీలంక) తరహాలోనే ఈ యేడాది కూడా వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 
 
ఈ మ్యాచ్‌లో గెలుపొందితే న్యూజిలాండ్‌కు తొలిసారి వరల్డ్ కప్ దక్కినట్టు అవుతుంది. అదే ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మాత్రం రికార్డు స్థాయిలో ఐదోసారి గెలుపొందినట్టు అవుతుంది. గతంలో 1987లో అలెన్ బోర్డర్ నాయకత్వంలో, 1999లో స్టీవ్ వా సారథ్యంలో, 2003, 2007 సంవత్సరాల్లో రికీ పాంటింగ్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. 
 
అదేవిధంగా ఈ వరల్డ్ కప్ జరిగే మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లకు రెండోసారి ఆతిథ్యమివ్వనుంది. గత 1992లో తొలిసారి ఆతిథ్యమిచ్చింది. ఈ క్రికెట్ గ్రౌండ్ కెపాసిటీ 90,000. ఆదివారం ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే, తదుపరి రోజున అదే సమయానికి మళ్లీ నిర్వహిస్తారు. తాగా, ఇప్పటివరకు ఆస్టేలియా-న్యూజిలాండ్ జట్లు 9 సార్లు తలపడితే, 6 సార్లు ఆస్టేలియా గెలుపొందగా, 3 సార్లు 
 
ఇరు జట్ల వివరాలు.. 
ఆస్ట్రేలియా: మైఖేల్ క్లార్క్ (కెప్టెన్), జార్జ్ బెయిలీ (వైస్-కెప్టెన్), ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, గ్లెన్ మాక్స్వెల్, జేమ్స్ ఫాల్క్నెర్, బ్రాడ్ హడిన్ (వికెట్ కీపర్), మిచెల్ జాన్సన్, మిచెల్ స్టార్క్, జోష్ హెజెల్‌వుడ్, మిఛెల్ మార్ష్, పాట్ కమ్మిన్స్, జేవియర్ దొహర్తి. 
 
న్యూజిలాండ్: బ్రెండెన్ మెక్‌కల్లమ్ (కెప్టెన్), మార్టిన్ గుప్తిల్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, కోరీ ఆండర్సన్, గ్రాంట్ ఇలియట్, ల్యూక్ రోంచీ (వికెట్ కీపర్), టామ్ లాథమ్, మిచెల్ , నాథన్ మెక్కల్లమ్, కైల్ మిల్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, డేనియల్ వెట్టోరి, ట్రెంట్ బౌల్ట్. 
 
మ్యాచ్ అధికార ప్రతినిధులు:  
మైదానపు అంపైర్లు: కుమార ధర్మసేన (శ్రీలంక), రిచర్డ్ కెట్టల్ బోర్గ్ (ఇంగ్లాండ్) 
థర్డ్ అంపైర్ - మాయరే ఎరాస్మస్ (సౌతాఫ్రికా) 
ఫోర్త్ అంపైర్ - ఇయాన్ గౌల్డ్ (ఇంగ్లాండ్) 
మ్యాచ్ రిఫరీ - రంజన్ మదుగలే (శ్రీలంక).