గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (14:56 IST)

నాగ్‌పూర్ టెస్ట్ : ఉత్కంఠతకు తెర... విజయానికి చేరువలో భారత్

నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయానికి మరో నాలుగు వికెట్ల దూరంలో ఉంది. రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 32/2 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు... మరో రెండు వికెట్లను జట్టు స్కోరు 58 పరుగుల్లోపు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఆమ్లా, ప్లెసిస్‌లు జట్టును ఓడ్డుకు చేర్చే బాధ్యతలను స్వీకరించారు. ఫలితంగా వీరిద్దరు కలిసి 72 పరుగుల అత్యంత అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంత సేవు భారత బౌలర్లు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. 
 
ఈ క్రమంలో ఆమ్లా (39) అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి సఫారీల స్కోరు 130/5. ఆ తర్వాత మరో ఐదు పరుగుల వ్యవధిలో డుప్లెసిస్ (39) కూడా ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ప్లెసిస్‌ను కూడా మిశ్రానే క్లీన్ బౌల్డ్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్లంతా పెవిలియన్‌కు చేరగా, ఇక టెయిలండర్లు క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో మిశ్రా, అశ్విన్‌లు తలా మూడేసి వికెట్లను తీసుకున్నారు.