శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 జనవరి 2016 (16:51 IST)

ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫ్లాష్ ఫ్లాష్: సెరీనా విలియమ్స్‌పై కెర్బెర్ గెలుపు.. నెం.2పైకి!

ఆస్ట్రేలియా ఓపెన్‌లో నల్లకలువలకు చుక్కెదురైంది. ఇప్పటికే వీనస్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించగా, సెరీనా విలియమ్స్ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో సెరీనాను జర్మనీకి చెందిన కెర్బెర్ మట్టి కరిపించింది. 6-4, 3-6, 6-4తో సెరీనాను ఓడించి చరిత్ర సృష్టించింది. తద్వారా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 
 
ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ పోరులో ప్రత్యర్థిపై ధీటుగా పోరాడిన సెరీనా విలియమ్స్, రెండో సెట్లో కాస్త తడబడింది. ప్రత్యర్థిపై మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ మ్యాచ్‌ను గెలుచుకోలేకపోయింది. తద్వారా జర్మన్ క్రీడాకారిణి కెర్బెర్ తన ఖాతాలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతంలో 2012 వింబుల్డన్, 2011 యూఎస్ ఓపెన్‌లలో సెమీఫైనల్స్ వరకే పోరాడింది. ప్రస్తుతం సెరీనాపై సాధించిన విజయం ద్వారా కెర్బర్‌ నెం.2 ర్యాంకును సొంతం చేసుకుంది.