శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 1 జూన్ 2017 (17:42 IST)

అనిల్ కుంబ్లేపై లీక్ రూమర్.. టీమిండియా కొత్త కోచ్‌గా టామ్ మూడీ?

టీమిండియా హెడ్ కోచ్, మాజీ స్టార్ ప్లేయర్ అనిల్ కుంబ్లేపై కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. టీమిండియాకు చెందిన సమాచారాన్ని మీడియా లీక్ చేస్తున్నారని.. అందుకే అనిల్ కుంబ్లే- జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్

టీమిండియా హెడ్ కోచ్, మాజీ స్టార్ ప్లేయర్ అనిల్ కుంబ్లేపై కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. టీమిండియాకు చెందిన సమాచారాన్ని మీడియా లీక్ చేస్తున్నారని.. అందుకే అనిల్ కుంబ్లే- జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య అగాధం పెరిగిందని జాతీయ మీడియా కోడైకూస్తోంది. అనిల్ కుంబ్లే మీడియాలో ఉన్న తన మిత్రులతో కూడిన ఓ వాట్సాప్ గ్రూపును ఏర్పాడు చేశాడని.. ఈ గ్రూపులో జట్టుకు సంబంధించిన సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు లీక్ చేస్తున్నాడని ఓ జాతీయ వార్తా పత్రిక తెలిపింది. 
 
అంతేగాకుండా.. ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడిన సమాచారాన్ని కూడా కుంబ్లే వాట్సాప్ ద్వారా పంపుతున్నట్లు ఆ మీడియా పేర్కొంది. కోచ్‌గా కుంబ్లే పదవీకాలం ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ముగియనుంది. ఈ నేపథ్యంలో, కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది.
 
అయితే బీసీసీఐలో ఇప్పటికే ముసలం ఏర్పడింది. బీసీసీఐలో లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌(సీఓఏ) నుంచి రామచంద్ర గుహ తప్పుకోవడంతో టీమిండియా క్రికెటర్లు తలపట్టుకున్నారు. రామచంద్ర తాను వ్యక్తిగత కారణాల ద్వారా తప్పుకుంటున్నట్లు తెలిపారు.
 
ఈ నేపథ్యంలో కోచ్ ఎంపిక ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ.. గతంలో శ్రీలంక జట్టుకు కోచ్‌గా వ్యవహరించడంతో పాటు, ఉపఖండంలో పిచ్ పరిస్థితులపై అవగాహన కలిగివున్న టామ్ మూడీ భారత జట్టుకు కోచ్‌గా ఎంపిక కానున్నట్లు సమాచారం. జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అనిల్‌ కుంబ్లేల మధ్య విభేదాలు రాగా, టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.