శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (15:31 IST)

నాకు బుకీతో సంబంధాలు ఉన్నాయా: అనురాగ్ ఠాకూర్ ఖండన

తనకు బుకీతో సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఖండించారు. పనిలో పనిగా ఐసీసీ ఛైర్మన్‌ ఎన్ శ్రీనివాసన్‌పై అనురాగ్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఇంకా అనురాగ్ ఠాకూర్ శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఘాటైన బహిరంగ లేఖ రాశారు. అనుమానిత బుకీల లిస్ట్‌ను శ్రీనివాసన్  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 
 
అభీష్టానికి వ్యతిరేకంగా తాను బోర్డు కార్యదర్శి కావడం వల్లే, తనకు బుకీతో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని అనురాగ్‌ మండిపడ్డారు. అనుమానాస్పద బుకీలకు సంబంధించిన సమాచారాన్ని శ్రీనివాసన్‌ బీసీసీఐలోని సభ్యులందరికీ ఇవ్వాల్సిందన్నాడు.

పనిలో పనిగా ఆ సమాచారాన్ని బెట్టింగ్‌ చేసినట్లు రుజువైన తన కుటుంబ సభ్యులతోనూ (శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మయప్పన్‌ను ఉద్దేశించి) పంచుకోవాల్సిందని, శ్రీని అల్లుడు మీయప్పన్‌ను ఉద్దేశించి చురక అంటించాడు.