మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 22 మే 2016 (11:42 IST)

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్... సెక్రటరీగా షిర్కే

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త సారథిగా ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తూ వచ్చిన శశాంక్ మనోహర్ ఐసీసీ అధ్యక్షుడిగా నియమితులు కావడంతో ఆ స్థానంలో కొత్త ఎంపిక అనివార్యమైంది. 
 
ఈ నేపథ్యంలో.. అధ్యక్ష పదవి కోసం అనురాగ్ ఠాకూర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 41 యేళ్ళ అనురాగ్ ఠాకూర్ వచ్చే యేడాది సెప్టెంబర్ వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈయన బీసీసీఐ 34వ అధ్యక్షుడు 
 
అలాగే, బీసీసీఐ కార్యదర్శిగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజయ్ షిర్కే పేరును అనురాగ్ ఠాకూర్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక సమావేశంలో ఎంపిక చేశారు. ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపట్టడం కోసం మనోహర్‌ కొన్ని రోజుల కిందటే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.