శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (16:29 IST)

కోహ్లీ- అనుష్క విడిపోయారా? నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వార్తలు!

క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కలు విడిపోయినట్టు నెట్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క అకౌంట్‌ను ఫాలో అయ్యే కోహ్లీ.. ఇటీవలి కాలంలో పట్టించుకోకపోవడమే అందుకు సాక్ష్యమంటున్నాయి. కోహ్లీ పెళ్లి ప్రతిపాదనను అనుష్క తిరస్కరించడం వల్లే వారి మధ్య విభేదాలు తలెత్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 
 
సినిమా కెరీర్‌పైనే తన పూర్తి ఫోకస్‌ అని.. 2017 వరకు పెళ్లి ప్రస్తావనే లేదని అనుష్క తెగేసి చెప్పినట్టు సమాచారం. దీనికి విరాట్ కోహ్లీ వైఖరి ఓ ఆధారంగా ఉంది. తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం పెళ్లి కోసం గడ్డం పెంచిన విరాట్‌.. ఇప్పుడు తీసేయడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గత యేడాది కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్టు ఉహాగానాలు బలంగా వినిపించాయి. కానీ వీటిని అనుష్క కొట్టిపారేసింది.