బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR

యాషెస్ ఫస్ట్ టెస్ట్ : ఆసీస్ చిత్తు.. ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ

ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు చిత్తయింది. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు ఈ టెస్టును నాలుగు రోజుల్లోనే ముగించి.. కేవలం 169 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఫలితంగా ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 430 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 308 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 289 రన్స్‌‌కే పరిమితమైంది. దీంతో ఆస్ట్రేలియా ముంగిట 412 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కంగారులు.. 70.3 ఓవర్లలో 242 పరుగులకే కుప్పకూలింది. మిచెల్‌ జాన్సన్‌ (77), డేవిడ్‌ వార్నర్‌ (52)లు ట్రాప్ స్కోరర్లుగా నిలిచారు. 
 
కుక్ బౌలర్లలో స్టువర్ట్‌ బ్రాడ్‌ (3/39), మొయిన్‌ అలీ (3/59), మార్క్‌ వుడ్‌ (2/53), రూట్‌ (2/28) అద్భుతంగా బౌలింగ్ చేసి కంగారూల పతనాన్ని శాసించారు. జో రూట్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. రెండు రోజుల సమయం ఉన్నా క్లార్క్‌సేన పోరాడకుండానే చేతులెత్తేయడం మనార్హం.