గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (17:36 IST)

పది వికెట్లతో అశ్విన్ అదుర్స్.. టెస్టు బౌలర్లలో అశ్విన్‌కు మూడో స్థానం...

టీమిండియా ఆడిన చారిత్రక 500వ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 197 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఏకంగా పది వికెట్లు పడగొట్టిన అశ్విన్‌పై క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ

టీమిండియా ఆడిన చారిత్రక 500వ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 197 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఏకంగా పది వికెట్లు పడగొట్టిన అశ్విన్‌పై క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పది వికెట్లు సాధించడం ద్వారా తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు కూడా సాధించిన అశ్విన్ జట్టుకు విజయాన్ని సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో టెస్టు బౌలర్లలో అశ్విన్ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. 
 
871 పాయింట్లతో ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్ (870)ను ఒక్క పాయింట్ ఆధిక్యంలో వెనక్కి నెట్టేశాడు. ఇక బౌలర్ల జాబితాలోనే కాకుండా ఆల్ రౌండర్ల జాబితాలోనూ అశ్విన్ మెరిశాడు. 450 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఈ పాయింట్స్ ద్వారా అశ్విన్ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకర్‌గా నిలిచాడు. అయితే ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే అశ్విన్ 450 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లోనే కొనసాగుతున్నాడు.