మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (14:00 IST)

ట్వంటీ-20 ర్యాంకింగ్స్: టీమిండియాతో పాటు అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియా టూర్లో భాగంగా వరుసగా ఓటమితో డీలాపడిన టీమిండియా చివర్లో పుంజుకుని వరుస విజయాలతో ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపించింది. ఒక్కసారిగా భారత జట్టు ట్వంటీ-20ల్లో ఎనిమిదో స్థానం నుంచి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ మూడు టీ-ట్వంటీల్లో అర్థ సెంచరీలతో ఆస్ట్రేలియా బౌలర్లకు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ టీట్వంటీ బ్యాట్స్ మన్‌గా నిలిచాడు. 
 
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ధాటికి అప్పటివరకు వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న ఆస్ట్రేలియా ట్వంటీ-20 కెప్టెన్ అరోన్ పించ్ రెండో స్థానానికి దిగజారాడు. తాజా ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు సురేష్ రైనా (13) మూడు స్థానాలు మెరుగుపరుచుకోగా, రోహిత్ శర్మ (16) నాలుగు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ప్రపంచ కప్ మెగా ఈవెంట్‌కు ముందు విడుదలైన ఈ ర్యాంకింగ్స్ ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.