బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 3 జూన్ 2017 (05:51 IST)

టీమిండియా జట్టుపై గెలుపా.. పాకిస్తాన్‌కా.. మరో మాట మాట్లాడండి అనేసిన షాహిద్ అప్రిది

టీమ్ ఇండియా ప్రస్తుతం ఉన్న బీభత్సమైన ఫామ్‌లో ఆ జట్టును పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడించే అవకాశాలు కల్లోమాటే అని ప్రకటించాడు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది. ఒక పాకిస్తానీయుడిగా పాక్ జట్టు గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటానని కానీ పాక్ కంటే భారత జట్టే

టీమ్ ఇండియా ప్రస్తుతం ఉన్న బీభత్సమైన ఫామ్‌లో ఆ జట్టును పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడించే అవకాశాలు కల్లోమాటే అని ప్రకటించాడు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది. ఒక పాకిస్తానీయుడిగా పాక్ జట్టు గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటానని కానీ పాక్ కంటే భారత జట్టే అన్ని అంశాల్లో మెరుగ్గా ఉంది కాబట్టి పాక్‌ టీమ్‌కు గెలిచే అవకాశాలే లేవని అఫ్రిది తేల్చి చెప్పేశాడు.
 
ప్రస్తుతం ఫామ్, జట్టు బలాబలాలను చూస్తే పాకిస్తాన్‌పై భారత్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. ‘ఒక పాకిస్తానీగా మా దేశం గెలవాలనే నేను కోరుకుంటాను. కానీ ప్రస్తుత భారత జట్టు అన్ని అంశాల్లో పాక్‌కంటే మెరుగ్గా కనిపిస్తోంది. కోహ్లి నాయకత్వంలో జట్టు చాలా బాగా ఆడుతోంది. ఒకవేళ ఆరంభంలోనే కోహ్లిని అవుట్‌ చేయగలిగితే పాక్‌ కాస్త పైచేయి సాధించే అవకాశం ఉంది’ అని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. 
 
ఇక భారత బౌలర్ల విషయానికి వస్తే పేస్ బౌలర్ బుమ్రా బౌలింగ్‌ను అప్రిది ప్రత్యేకంగా ప్రశంసించారు. 1990లలో తమ బౌలర్లు అద్భుతంగా ఉపయోగించిన ‘పాకిస్తానీ యార్కర్లు’ బుమ్రా అద్భుతంగా వేస్తున్నాడని అన్నాడు. 
 
భారత క్రికెట్ జట్టుపై విజయసాధనే ధ్యేయంగా జీవిత కాలం పోరాడిన షాహిద్ అప్రిది ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోపీలో పాకిస్తాన్ జట్టుపై భారత జట్టుకే విజయావకాశాలు ఉన్నాయని ముందే చెప్పడం విశేషం.
 
జూన్ 4వ తేదీన లండన్‌లో భారత్, పాక్ జట్ల మద్య లీగ్ మ్యాచ్ జరగడం తెలిసిందే.