శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (11:00 IST)

ఇంట్లో పనిపిల్లకు వాతలు : బంగ్లా క్రికెటర్ షహదత్ భార్య అరెస్ట్

తమ ఇంట్లో పని చేసే 11 యేళ్ల బాలికను వేధించిన కేసులో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు క్రికెటర్ షహదత్ హుస్సేన్ భార్య న్రిట్టో హుస్సేన్‌ను ఢాకా పోలీసులు అరెస్టు చేశారు. ఈ బాలికను వేధించడమే కాకుండా, తీవ్రంగా గాయపరిచినట్టు న్రిట్టో హుస్సేన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
 
వాస్తవానికి ఈ తరహా ఆరోపణలు వచ్చిన వెంటనే న్రిట్టో హుస్సేన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలో.. ఆదివారం షహదత్ భార్యను ఆమె పుట్టింట్లో అదుపులోకి తీసుకున్నారు. షహదత్‌ను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. బాలికను చిత్రహింసలకు గురిచేశాడన్న ఆరోపణల నేపథ్యంలో షహదత్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.