బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2015 (11:31 IST)

నరైన్ బౌలింగ్‌ శైలిపై బీసీసీఐ అభ్యంతరం: షరతులతో కూడిన నిషేధం!

వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలిపై బీసీసీఐ మరోసారి షాకిచ్చింది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా అతనిపై షరతులతో కూడిన నిషేధాన్ని విధించింది. ఇకపై బోర్డు నిర్వహించే టోర్నీలలో అతను ఆఫ్ స్పిన్ బంతులు వేయరాదని ఆదేశించింది. ఇటీవల విశాఖపట్నంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ నరైన్ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు.
 
ఐపీఎల్ నియమావళిలోని రూల్ 24.2ను అతను ఉల్లంఘిస్తున్నాడని వారు తేల్చారు. దాంతో అతను చెన్నైలోని బయోమెకానికల్ కేంద్రానికి వెళ్లి దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నరైన్ ఆఫ్ బ్రేక్ బంతులు మాత్రం నిబంధనలకు అనుగుణంగా లేవని బీసీసీఐ స్పష్టం చేసింది. 
 
అయితే ఆఫ్ బ్రేక్ బంతులు కాకుండా ఇతర రకాల వైవిధ్యమైన బంతులతో అతను ఐపీఎల్‌లో బౌలింగ్ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ మరోసారి నరైన్ యాక్షన్ సందేహంగా ఉంటే అంపైర్లు దానిని నోబాల్‌గా ప్రకటించి తదుపరి చర్యలకు సిఫారసు చేయవచ్చు.