శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (11:13 IST)

ద్రవిడ్‌ను కోరాం.. కుదరదన్నాడు.. అనిల్ కుంబ్లేను ఎంపిక చేస్తామనుకోలేదు: అనురాగ్ ఠాకూర్

భారత క్రికెట్ జట్టుకు క్రికెట్ లెజెండ్ అనిల్ కుంబ్లేను కోచ్‌గా తొలుత భావించలేదనీ బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాగూర్ చెప్పారు. అనిల్ కుంబ్లేను క్రికెట్ కోచ్‌గా ఎంపిక చేసిన విషయం తెల్సిందే. దీంతో కుంబ్లే ఒక యేడాది పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించనున్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ.. వాస్తవానికి తాము మొదట రాహుల్ ద్రావిడ్‌ను కోచ్‌గా నియమించాలని భావించామన్నారు. "భారత టీమ్‌కు కోచ్‌గా ఉండాలని నేను రాహుల్ ద్రావిడ్‌ను కోరాను. ఆయన కాదనలేదు. అయితే, జూనియర్ టీమ్ కోసం పనిచేస్తానని చెప్పాడు" అని ఠాకూర్ వెల్లడించారు. 
 
రాహుల్ ద్రావిడ్ మంచి గుణం అదేనని, సీనియర్ టీమ్‌కు కోచ్‌గా ఉండి, అధిక డబ్బు పేరు తెచ్చుకోవాలని భావించకుండా, చిన్నారులను మెరుగైన క్రికెటర్లుగా తీర్చిదిద్దాలని ఆయన భావించాడని, అతని ఆలోచనను తాము స్వాగతిస్తున్నట్టు చెప్పాకొచ్చారు.