గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2016 (16:54 IST)

బీసీసీఐ వ్యవహారం కోర్టు ధిక్కారణ కిందకే వస్తుందా?: సుప్రీం Vs బీసీసీఐ

లోధా ప్యానెల్ సిఫార్సుల అమలుపై బీసీసీఐ సుప్రీం కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయంలో సుప్రీంతో బీసీసీఐ ఢీ అంటే ఢీ అంటోంది. దేశంలో అతి పెద్ద వ్యవస్థగా పేరున్న బీస

లోధా ప్యానెల్ సిఫార్సుల అమలుపై బీసీసీఐ సుప్రీం కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయంలో సుప్రీంతో బీసీసీఐ ఢీ అంటే ఢీ అంటోంది. దేశంలో అతి పెద్ద వ్యవస్థగా పేరున్న బీసీసీఐనే సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించకపోవడం పలు చర్చలకు దారితీసింది. రేపటిలోపు (శుక్రవారం) లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇస్తారా లేదా అని బీసీసీఐని సుప్రీం ప్రశ్నించింది. 
 
అలాకాకుంటే పాలకవర్గాన్ని మొత్తం రద్దు చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమంటారా అంటారా అంటూ సుప్రీం కోర్టు బీసీసీఐని ప్రశ్నించింది. దీనిపై స్పందిస్తూ సిఫార్సుల అమలుపై ఇప్పుడే ఎలాంటి హామీ ఇవ్వలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే బీసీసీఐ వ్యవహారం కోర్డు ధిక్కారం కిందకే వస్తుందని లోధా అన్నారు. 
 
గురువారం సుప్రీంలో జరిగిన వాదనల అనంతరం.. సమయాన్ని వృధా చేయవద్దని.. లోధా సిఫార్సులను అమలు చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వండి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐని సీజేఐ టీఎస్ ఠాకూర్ హెచ్చరించారు. వీటిని అమ‌లు చేయ‌డానికి కొత్త‌గా ఓ పాల‌క‌వ‌ర్గాన్ని నియ‌మించే దిశ‌గా కోర్టు ఆలోచ‌న చేస్తోంది.