గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 జులై 2016 (11:50 IST)

జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులపై బీసీసీఐ పిటిషన్‌: రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం కోర్టు

క్రికెట్‌ను చట్టబద్ధం చేయడంతో పాటు.. ఒక రాష్ట్రంలో ఒక సంఘానికి ఓటు, బీసీసీఐ పదవిని పరిమితం చేయడం వంటి అనేక అంశాలను జస్టిస్ లోథా కమిటీ ప్రతిపాదించింది. జస్టిస్ లోథా కమిటీ సూచించిన పలు ప్రతిపాదనలు అమలుక

క్రికెట్‌ను చట్టబద్ధం చేయడంతో పాటు.. ఒక రాష్ట్రంలో ఒక సంఘానికి ఓటు, బీసీసీఐ పదవిని పరిమితం చేయడం వంటి అనేక అంశాలను జస్టిస్ లోథా కమిటీ ప్రతిపాదించింది. జస్టిస్ లోథా కమిటీ సూచించిన పలు ప్రతిపాదనలు అమలుకు గత మే నెలలో శ్రీకారం చుట్టినట్లు బీసీసీఐ అడ్వాకేట్ కేకే వేణుగోపాల్ సుప్రీంకు విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత జనవరిలో ఏర్పాటైన జస్టిస్ లోథా కమిటీ చేసిన సిఫార్సులపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదేశాలను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. 
 
లోథా కమిటీ ప్రతిపాదనలపై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసిన బీసీసీఐ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గత కొన్ని నెలలుగా జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఇబ్రహీం కలిఫుల్లాలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదేశాలను రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.