మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2015 (11:51 IST)

బీసీసీఐ నుంచి శ్రీనివాసన్‌ను మెడపట్టి గెంటేస్తారట?

బీసీసీఐ నుంచి స్వయంగా తప్పుకునేందుకు నిరాకరిస్తూ వస్తోన్న శ్రీనివాసన్‌ను గెంటివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. బీసీసీఐ నుంచి తప్పుకోనని భీష్మించుకుని కూర్చున్న శ్రీనివాసన్‌ను గెంటివేయడం తప్పదని తెలుస్తోంది. ఇందుకోసం బీసీసీఐ కార్యనిర్వాహక కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

బీసీసీఐ అధ్యక్షుడు జగమోహన్ దాల్మియా నేతృత్వంలో జరగనున్న సమావేశంలో శ్రీనివాసన్ ఎటువంటి కార్యకలాపాల్లో భాగం కాకుండా నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఆయన ఐసీసీ అధ్యక్ష పదవి సైతం ప్రమాదంలో పడ్డట్టేనని వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా, బీసీసీఐలో జరిగిన మరో అవినీతి వెలుగులోకి రావడంతో దాల్మియా ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. బుకీల గురించి శ్రీనివాసన్ స్వయంగా తన కుటుంబ సభ్యులతో చర్చించినట్టు ఆరోపణలు రాగా, బెట్టింగ్ రాకెట్‌లో వారి ప్రమేయంపై ఆధారాలు లభించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చివరి రోజైన మే 24న బీసీసీఐ సమావేశం కానున్నట్టు సమాచారం.