గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:55 IST)

క్రికెట్ బుకీతో పార్టీ : రెడ్ హ్యాండడ్‌గా దొరికిపోయిన అనురాగ్ ఠాకూర్!

ఐపీఎల్ ఎంట్రీతో క్రికెట్‌లో బుకీల పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో తెలిసొచ్చింది. ఆటలో చక్రం తిప్పే క్రమంలో బుకీలు ఆటగాళ్లకు వల వేయడం తెలిసిందే. ఇందుకోసం మందు, మగువ, చివరాఖరుకు డబ్బును ఎరగా వేస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన గురుతర బాధ్యతను స్వీకరించిన బీసీసీఐ, తామేంటో నిరూపించుకుంటామని ప్రకటనే చేసింది. అయితే ఓ బడా క్రికెట్ బుకీతో ఆ సంస్థ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పార్టీ చేసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. 
 
బీసీసీఐలో అద్యక్షుడి తర్వాత కార్యదర్శి పదవే అత్యున్నతమైనది. కీలక నిర్ణయాల్లో ఈ పదవిలోని వ్యక్తికి సముచిత స్థానం ఉంటోంది. అలాంటి పదవిలో ఉన్న అనురాగ్ ఠాకూర్, ఐసీసీ నిషేదిత జాబితాలో ఉన్న క్రికెట్ బుకీ కరణ్ గిల్హోత్రాతో కలిసి పార్టీ చేసుకున్నారట. ఓ ఆంగ్ల టీవీ ఛానెల్ ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను ప్రసారం చేయగా, సమాచారం అందుకున్న ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్ సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తక్షణమే ఠాకూర్ పై చర్యలు తీసుకోవాలని రిచర్డ్ సన్ బీసీసీఐకి ఈ-మెయిల్ పంపారు. అయితే దీనిని బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా ఏమాత్రం పట్టించుకోలేదట. ఇంకా చెప్పాలంటే ఆదివారం జరిగిన బీసీసీఐ సమావేశంలో దీనిపై చర్చ కూడా జరగలేదట.