శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (14:19 IST)

బీసీసీఐ కొత్త చీఫ్‌గా శశాంక్ మనోహర్: అక్టోబర్ 4న ఎన్నిక!

బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరణించడంతో 15 రోజుల్లో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ముందుగా అనురాగ్ ఠాకూర్ పేరు వినిపించినప్పటికీ.. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన శశాంక్ పేరు తెరపైకి వచ్చింది.
 
నాగపూర్ న్యాయవాది అయిన శశాంక్ మనోహర్.. విదర్భ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మేరకు అక్టోబర్ 4న ముంబైలో జరిగే బీసీసీఐ ప్రత్యేక జనరల్ మీటింగ్‌లో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసి, అదే రోజున ప్రకటన చేస్తారు.
 
ఈ విషయమై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ బీసీసీఐ కొత్త అధ్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకోవట్లేదన్నారు. నామినేషన్లను అక్టోబర్ 3వ తేదీలోపు దాఖలు చేయాల్సి వుంటుందన్నారు. కాగా.. బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ శశాంక్ మనోహన్ పేరును బీసీసీఐ కొత్త అధినేతగా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.