శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (14:07 IST)

ఆడిటర్లను మార్చేసిన బీసీసీఐ: చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్.. శ్రీనికి చెక్!

బీసీసీఐ కొత్త అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వచ్చీరాగానే శ్రీనివాసన్‌కు చెక్ పెట్టేలా వ్యవహరించారు. బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ సొంతూరైన చెన్నైలో బీసీసీఐ ట్రెజరీని ముంబైకి మార్చేశారు. అలాగే, బీసీసీఐ ఆడిటింగ్ బాధ్యతలకు కూడా చెన్నైవాసులు వద్దని బీసీసీఐ నిర్ణయించుకుంది. అంతే.. వెంట వెంటనే ఆడిటర్లు మారిపోయారు. ఈ తతంగమంతా బుధవారమే చకచక జరిగిపోయింది. 
 
అంతేగాకుండా.. ‘‘బోర్డుకు సంబంధించిన అన్ని పన్నుల విషయాలు ముంబై ఆదాయపన్ను శాఖ పరిధిలోనే జరగాలి. అందుకే ట్రెజరీని ముంబైకి తరలిస్తున్నాం’’ బీసీసీఐ అధికారులు తెలిపారు. ఇక ఆడిటింగ్‌లో విశేష అనుభవం ఉన్న ముంబై ఆడిటింగ్ సంస్థ గోఖలే, సాథే కంపెనీ ఇకపై తమ లెక్కాపద్దుల్ని పర్యవేక్షిస్తుందని బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. పనిలో పనిగా బోర్డు ఆడిటర్‌గా వ్యవహరించిన ఫరమ్ (చెన్నై ఆడిటర్) సేవలను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ తేల్చి చెప్పేసింది.