మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 మే 2015 (12:23 IST)

నో బాల్‌కు పెవిలియన్ చేరిన డార్బీషైర్.. ప్రత్యర్థి జట్టుపై ఫైర్

క్రికెట్ అభిమానులకు నోబాల్ నిబంధన గురించి తెలియకుండా ఉండదు. ఓ బౌలర్ నోబాల్ వేసిన తర్వాత కేవలం రనౌట్ రూపంలో మాత్రమే బ్యాట్స్‌మెన్ అవుట్ అయ్యే ఛాన్సుంది. మిగతా ఏ రకంగా ఆడినా అవుట్ కారు.. కానీ, ఇంగ్లిష్ కౌంటీ క్రికెటర్ బ్రయాన్ డార్బీషైర్ ఓ మ్యాచ్ ఆడుతూ నోబాల్‌కు పెవీలియన్‌కు చేరిన ఘటన ఆసక్తికరంగా మారింది.
 
బౌలర్ నోబాల్ వేయగా, దాన్ని ఢిపెన్స్ ఆడిన డార్బీషైర్ తనకు సమీపంలో పడ్డ బాల్ ను తీసి ఫీల్డర్ వైపు విసిరాడు. దీంతో సదరు ఫీల్డర్ డార్బీషైర్ అవుట్ అయినట్టు ఫీల్డర్ అపీలు చేయడం, అంపైర్ చూపుడు వేలును పెకెత్తడం జరిగిపోయాయి. కాగా, ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాట్స్ మెన్ బంతిని తాకకూడదనేది స్థానిక మెర్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధన. దీంతోనే డార్బీషైర్ అవుటయ్యాడని ఎంసీసీ సలహాదారు మార్క్ విలియమ్స్ స్పష్టం చేశారు. 
 
అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నోబాల్‌కు ఈ తరహాలో ఓ క్రికెటర్ అవుట్ అయి పెవిలియన్‌‍కు చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాను అవుటైన విధానంపై డార్బీషైర్ ప్రత్యర్థి జట్టుపై విమర్శలు గుప్పించాడు. ఆ జట్టుకు అసలు గేమ్ స్పిరిట్ లేదని ఫైర్ అయ్యాడు.