Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ మహిళతో సెల్ఫీ దిగితే గోల్డెన్ డకౌట్ కావాల్సిందే.. జట్టూ ఓడిపోవాల్సిందే.. ఎవరామె?

శనివారం, 10 జూన్ 2017 (15:51 IST)

Widgets Magazine
zainab abbas

జైనాబ్ అబ్బాస్. ఈ పేరు ఇపుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇంతకీ ఈమె ఎవరన్నదే కదా మీ సందేహం. ఈమె ఎవరో కాదు.. పాకిస్థాన్ స్పోర్ట్స్ ఎనలిస్ట్. ఛాంపియన్స్ ట్రోఫీ అప్‌డేట్స్ అందించేందుకు ఇంగ్లండ్‌లో ఉంది. ఈమె ఏబీ డివిలీర్స్, విరాట్ కోహ్లీని గోల్డెన్ డకౌట్ చేసింది. అదేంటి ఆమె డకౌట్ చేయడమేంటనే కదా మీ ప్రశ్న. ఈ ఇద్దరు కెప్టెన్లతో ఆమె సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీ మహిమతో ఇద్దరూ కెప్టెన్లూ డకౌట్ కావడమే కాకుండా, ఏకంగా మ్యాచ్‌లలో కూడా ఓడిపోయారు. దీంతో జైనాబ్ అబ్బాస్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. 
 
పాకిస్థాన్‌తో దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆడేముందు సఫారీ కెప్టెన్ ఏబీ.డివిలీర్స్‌తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే, ఆ మ్యాచ్‌లో డివిలీర్స్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అలాగే, ఆదివారం శ్రీలంకతో భారత్ మ్యాచ్ ఆడేందుకు ముందు స్టేడియంకి వచ్చిన జైనాబ్ అబ్బాస్... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కూడా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే, ఆ మ్యాచ్‌లో కోహ్లీ కూడా డకౌట్ అయ్యాడు. పైగా జట్టు కూడా ఓడిపోయింది. దీంతో ఆమెది ఐరన్ లెగ్ అంటూ కోహ్లీ, డివిలీర్స్ అభిమానులు మండిపడుతున్నారు.
 
అయితే, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు మాత్రం సంబరబడిపోతూ... ఆమెను మరోలా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అదెలాగంటే... సోమవారం పాకిస్థాన్ జట్టు శ్రీలంకతో తలపడనుంది. దీంతో శ్రీలంక కెప్టెన్‌తో ఆమె సెల్ఫీ దిగాలంటూ కోరుతున్నారు. ఇలా చేస్తే తమ జట్టు గెలుస్తుందన్నది వారి మూఢనమ్మకంగా ఉంది. మరి జైనాబ్ అబ్బాస్ ఏం చేస్తుందో వేచిచూద్ధాం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

చాంపియన్స్ ట్రోఫీ : న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి న్యూజిలాండ్ జట్టు ...

news

కెప్టెన్‌ కోహ్లి చెప్పాడని కుంబ్లేను మారిస్తే బోర్డు గతేమిటి? కోచ్‌ మార్పుపై సందిగ్ధంలో బీసీసీఐ

భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కూడా చేయలేని సాహసానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ...

news

ఒక్క గేమ్ పోయింది.. కోహ్లీపై అందరూ ఫైర్.. పాక్‌ను చూసి నేర్చుకోమంటున్నారే..

చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు.. అండర్ ...

news

మహేంద్ర సింగ్ ధోనీ కాదు.. మహేంద్ర బాహుబలి.. ఆకాశానికెత్తిన సెహ్వాగ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' మేనియా భారత క్రికెట్లోనూ ఏ మేరకు ఉందో ...

Widgets Magazine