Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెన్నై వన్డే : హార్దిక్ పాండ్యా మెరుపులు.. ఆపద్బాంధవుడు ధోనీ...

ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (17:17 IST)

Widgets Magazine

ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా, ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం నుంచే కష్టాల్లోపడింది. కేవలం 87 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. 
 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 పరుగుల వద్ద అజింక్యా రహానే (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అదే స్కోరు వద్ద కెప్టెన్ కోహ్లీ (0), మనీష్ పాండే (0) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కేదార్ జాదవ్‌తో కలిసి రోహిత్ శర్మ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే జట్టు స్కోరు 64 పరుగుల వద్ద ఉన్నప్పుడు రోహిత్ శర్మ (28) అవుటయ్యాడు. 
 
ఇలా 64 పరుగులకే నాలుగు ముఖ్యమైన వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత 87 పరుగుల వద్ద కేదార్ జాదవ్ (40) అవుటయ్యాడు. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత ధోనీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు నెమ్మదిగా ఆడుతూ.. జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఏకంగా ఆరో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 66 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 83 పరుగుల చేసి, జంపా బౌలింగ్‌లో ఫాల్క్‌నర్‌కు క్యాచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో ధోనీతో జతకలిసిన భువనేష్ కుమార్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అదేసమయంలో ధోనీ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 47 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఆస్ట్రేలియాతో తొలి వ‌న్డే.. ఇండియా ఫ‌స్ట్‌ బ్యాటింగ్

ఆస్ట్రేలియాతో ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో భారత ...

news

వీరేంద్ర సెహ్వాగ్ ఓ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు : గంగూలీ

భారత క్రికెట్ జట్టుకు ప‌ద‌వి త‌న‌కు ఎందుకు ద‌క్క‌లేదో చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్ ...

news

కోహ్లీ ఏనుగులాంటోడు... ఆ జర్నలిస్టు ఓ కుక్క : హర్భజన్ ట్వీట్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీను భారత టర్బోనేటర్ హర్భజన్ సింగ్ ఏనుగుతో పోల్చాడు. ...

news

ఇండో-పాక్ క్రికెట్ సంబంధాల్లో ఐసీసీ తలదూర్చదు: డేవ్ రిచర్డ్ సన్

ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ జరగని విషయం తెలిసిందే. ...