శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (12:36 IST)

ట్వంటీ-20 ప్రపంచ కప్: చెన్నై స్టేడియం డౌటేనన్న అనురాగ్ ఠాకూర్!

ట్వంటీ-20 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరుగనున్న ఈ సిరీస్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడు స్టేడియాలు ఎంపికైనాయి. అయితే పొట్టి క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన ఈ సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు ఇప్పటికీ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐతో మంతనాలు కొనసాగిస్తూనే ఉంది. 
 
అయితే చిదంబరం స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ట్వంటీ-20 వరల్డ్ కప్ మ్యాచ్‌కు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికయ్యే పరిస్థితులు ప్రస్తుతానికి లేవన్నారు.
 
స్టేడియంలోని కొన్ని స్టాండ్స్‌పై చెన్నై కార్పొరేషన్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఐసీసీ, స్టేడియంలోని అన్ని సీట్లకు సంబంధించిన టికెట్ల విక్రయానికి అనుమతి లభిస్తేనే మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది.