శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 మే 2016 (12:53 IST)

మ్యాచ్ మధ్యలో వయాగ్రా మాత్రలు వాడే ఫ్లింటాఫ్ నాకు పాఠాలు చెప్పడమా? క్రిస్ గేల్

స్పోర్ట్స్, ఇంటర్వ్యూ చేసే యాంకర్ల వద్ద అభ్యంతరకర పదజాలం వాడి వార్తల్లో నిలిచిపోయే క్రిస్ గేల్.. ఆత్మకథలో తనపై విమర్శలు గుప్పించిన వారిని ఏకిపారేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం బిగ్ బాష్ ట్వంటీ-20 లీగ్ సందర్భంగా మ్యాచ్ మధ్యలో తనను ఇంటర్వ్యూ చేస్తూ ఆమె అందచందాలను వర్ణిస్తూ డేటింగ్ వెళ్దామా అని పిలిచిన క్రిస్ గేల్ వివాదాన్ని కొనితెచ్చుకున్నాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో తనపై వచ్చిన విమర్శలకు క్రిస్ గేల్ ఆత్మకథ ద్వారా వివరణ ఇవ్వాలని భావిస్తున్నాడు. అంతేకాకుండా తనపై విమర్శలు గుప్పించిన వారిని టార్గెట్ టేస్తున్నాడు. ఈ  క్రమంసో ప్రస్తుతం మనం టీ20ల యుగంలో ఉన్నాం. ఇది టెస్టు క్రికెట్‌ కాదు. ఇప్పుడు ఏదైనా భిన్నంగా చేయాలి. నేను ఆ యాంకర్‌తో సరదాగా జోక్ చేశానంతేనని వివరణ ఇచ్చాడు. ఎవరినో అగౌరవపరచాలని తాను అలా చేయలేదన్నాడు. 
 
మ్యాచ్‌ల మధ్యలో వయాగ్రా మాత్రలు వాడే ఫ్లింటాఫ్‌ నాకు పాఠాలు చెప్పడమేంటి? అని క్రిస్ గేల్ ఏకిపారేశాడు. ఫ్లింటాఫ్ ఓ పిల్లాడు. ఎప్పుడైనా తనకు షార్ట్ పిచ్ బంతి వేస్తే అది బ్యాక్‌వర్డ్‌ పాయింట్లో బౌండరీగా తేలేది. ఇక వెస్టిండీస్‌లో క్రికెట్‌ ఆడుతూ ఓ అధికారిని కొట్టి దోషిగా తేలిన ఇయాన్‌ చాపెల్‌ తనను క్రికెట్ నుంచి నిషేధించాలని డిమాండ్ చేయడం సరికాదని గేల్ అన్నాడు.
 
తానో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా వయాగ్రా మాత్రలు వాడి చాలా ఇబ్బంది పడ్డానని ఫ్లింటాఫ్‌ చేసిన వ్యాఖ్యలను క్రిస్ గేల్ ఈ సందర్భంగా ఎత్తిచూపాడు. సో.. గేల్‌ను విమర్శించాలనుకుంటున్నారా..? కాస్త జాగ్రత్తగా ఉండండి మరి..!