శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (18:32 IST)

కొలంబో టెస్ట్ : సెంచరీతో భారత్‌ను ఆదుకున్న పుజారా.. భారత్ 292/8

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ను ఓపెనర్ ఛటేశ్వర్ పుజారా, స్పిన్నర్ అమిత్ మిశ్రాలు ఆదుకున్నారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. పుజారా (135 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా, అమిత్ మిశ్రా (59) అర్థ సెంచరీతో కీలకమైన భాగస్వామ్యాన్ని (104 పరుగులు) నెలకొల్పాడు. ఫలితంగా కష్టాల కడలి నుంచి ఓడ్డున పడింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసిన క్రమంలో వరుణుడు అడ్డుపడిన విషయం తెల్సిందే. ఫలితంగా తొలిరోజు ఆట మొత్తం వర్షార్పణమైంది. ఆ తర్వాత రెండో రోజైన శనివారం బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 180 పరుగులకే కీలకమైన ఎనిమిది ప్రధానమైన విరెట్లను కోల్పోయింది. 
 
ఇందులో ఓపెనర్ రాహుల్ 2, రహాన్ 8, కోహ్లీ 18, రోహిత్ శర్మ 26, బిన్నీ 0, ఓఝా 21, అశ్విన్ 5 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. కానీ, ఓ వైపు వికెట్లు పడుతున్న పుజారా మాత్రం ఏమాత్రం నిగ్రహం కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తూ.. అమిత్ మిశ్రాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో పుజారా 214 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 100 రన్స్ చేశారు. 
 
కోహ్లీతో కలిసి 50 పరుగులు, రోహిత్‌తో కలిసి 55 పరుగులు, ఓఝాతో కలిసి 54 రన్స్, మిశ్రాతో కలిసి 104 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో అమిత్ మిశ్రా కూడా అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మిశ్రా అవుట్ అయిన తర్వాత ఇషాంత్ శర్మ రెండు పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్ 4 వికెట్లు తీయగా, ప్రదీప్, మ్యాథ్యూస్, హెరాత్, కుషాల్ ఒక్కో వికెట్ చొప్పున తీశాడు.