శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (10:07 IST)

వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాను కంగారు పెట్టించిన న్యూజిలాండ్!

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గ్రూపు ఏలోని కీలక జట్లు అయిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగుతుందని భావించిన మ్యాచ్ పేలవంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టును న్యూజిలాండ్ బౌలర్లు కంగారెత్తించారు. ఫలితంగా కేవలం 32.2 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టులో ఒక్క ఆటగాడు కూడా రాణించలేదు. హడిన్ చేసిన 43 పరుగులే అత్యధికం. 
 
ఆస్ట్రేలియా స్కోర్‌లో ఫించ్ 14, వార్నర్ 34, వాట్సన్ 23, క్లార్క్ 12, స్మిత్ 4, మాక్స్ వెల్ 1, మార్ష్ 0, జాన్సన్ 1, స్టార్క్ 0, కుమిన్స్ 7 పరుగులకు అవుట్ అయ్యారు. 106 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 9వ వికెట్ కోల్పోగా అక్కడి నుంచి న్యూజిలాండ్ సహనానికి కొంత పరీక్ష ఎదురైంది. బ్రాడ్ హడిన్, కుమిన్స్ పరీక్ష పెట్టారు. జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ ను 150 పరుగులు దాటించారు. కివీస్ బౌలర్లలో బోల్ట్ ఐదు వికెట్లు తీసి కంగారుల వెన్నువిరవగా... సౌథీ, వెట్టోరిలు చెరో రెండేసి వికెట్లు తీశారు. 
 
ఆ తర్వాత 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లు ప్రస్తుతం 8.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి, విజయం దిశగా సాగుతోంది. ముఖ్యంగా.. ఆ జట్టు ఓపెనర్ మెక్ కుల్లమ్ బ్యాట్‌ను ఝుళిపించాడు. దీంతో 24 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు.