గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (18:25 IST)

క్రికెట్ పిచ్‌పై రెజ్లింగ్ - కిక్‌బాక్సింగ్.. బెర్ముడా క్రికెటర్ల స్లెడ్జింగ్ ఫలితం..

జెంటిల్‌మేన్ గేమ్‌గా పేరొందిన క్రికెట్‌ పిచ్‌పై క్రికెటర్లు తలపడ్డారు. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. స్లెడ్జింగ్‌కు దిగిన క్రికెటర్లు ఏకంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. ఒకరు బ్యాట్‌తో దాడి చేస్తే.. మరొకరు కాలితో తన్నాడు. పిచ్‌‌పై పొర్లాడారు. ఈ ఘటన బెర్ముడాలో తీవ్ర కలకలం రేపింది.
 
 
బెర్ముడాలో క్లబ్ క్రికెట్  క్లెవలాండ్ కంట్రి క్లబ్ - విల్లో కట్స్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా... జాసన్ అండర్సన్, జార్జ్ ఒబ్రాయిన్‌ అనే క్రికెటర్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇద్దరి మధ్య తొలుత వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగింది. అయితే నియంత్రణ కోల్పోయిన అండర్సన్ ఒక్కసారిగా ఒబ్రాయిన్‌పై విరుచుకుపడ్డాడు. ఒబ్రాయిన్‌పై బ్యాట్‌తో దాడి చేసి అండర్సన్ గాయపరిచాడు. దీంతో ఫీల్డ్ నుంచి అండర్సన్‌ను పంపించి వేశారు. 
 
నిజానికి జెంటిల్‌మేన్ గేమ్ క్రికెట్‌లో వాదులాటలకు తావు లేదు. అయితే టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ, మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌లతో పాటు ఆసీస్ జట్టు సభ్యులు మాత్రం ఇందుకు అతీతం. మైదానంలో వీరున్న చోట వాదులాటలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. తాజాగా వాదులాటలు శృతి మించి ముష్టి యుద్ధాల వరకు దిగడం ఈ క్రికెట్‌కే మచ్చ కలిగించే అంశంగా మారింది.