గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (15:54 IST)

వరల్డ్ కప్ : ఐర్లాండ్‌పై సత్తా చాటిన సఫారీలు.. 201 పరుగుల భారీ తేడాతో..!

ఐర్లాండ్‌పై సఫారీలు సత్తా చాటారు. ప్రపంచ కప్‌ గ్రూప్‌- బి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. కాగా 412 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 45 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది.

దక్షిణాప్రికా బౌలర్లు అబాట్‌, స్టెయిన్‌ ఐర్లాండ్‌కు గట్టి షాకిచ్చారు. దీంతో అబాట్‌ 4 వికెట్లు, స్టెయిన్‌ 2 వికెట్లు సాధించారు. ఐర్లాండ్‌ ప్రారంభంలోనే 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో దాదాపు ఓటమి ఖాయమైంది. 
 
బాల్బిర్నె 58,కెవిస్‌ ఒబ్రెయిన్‌ 48 మినహా ఇతర ఆటగాళ్లు మెరుగ్గా ఆడలేకపోయారు. ఫలితంగా వీరిద్దరూ ఆరో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఐర్లాండ్‌ ఓటమి కొంత ఆలస్యమైంది.

విండీస్‌తో పోలిస్తే ఐర్లాండ్‌ కొంతవరకు గట్టిపోటీనిచ్చింది. కాగా 5 వికెట్లకు 48 పరుగుల పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయింది. కాగా ఐర్లాండ్‌ భీకరమైన సఫారీ బౌలర్లను ఎదుర్కొని 200 పరుగుల మార్క్‌ను నమోదు చేసుకోవడం గమనార్హం. 
 
ఇకపోతే.. ఆమ్లాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఆమ్లా, డుప్టెసిస్‌ సెంచరీలతో బాగా రాణించారు. హషిమ్‌ ఆమ్లా, డుప్లెసిస్‌ సెంచరీలకు తోడు రోసో, మిల్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌‌తోడు కావడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. కాగా 12 పరుగులకే తొలి వికెట్‌ నష్టపోయిన సఫారీ టీమ్‌ను ఆమ్లా, డుప్లెసిస్‌ సెంచరీలతో భారీ స్కోర్‌ బాట పట్టించారు. 
 
దక్షిణాఫ్రికా టీమ్‌ తరపున ప్రపంచ కప్‌లో రెండవ వికెట్‌కు వీరిద్దరూ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. డెప్లెసిస్‌ 109 బంతులలో 10 బౌండరీలు,సిక్సర్‌తో 109 పరుగులు చేశాడు. ఆమ్లా 128 బంతులలో 16 బౌండరీలు, 4 సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. చివరలో రోసో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

కాగా 30 బంతుల్లో 6 బౌండరీలు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. మిల్లర్‌ 23 బంతులు ఆడి 4 బౌండరీలు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అతడికి తోడుగా నిలిచాడు.