శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2016 (14:32 IST)

రాజకీయాల్లోకి వచ్చిన మరో క్రికెటర్.. ఎస్పీలోకి క్రికెటర్ ప్రవీణ్ కుమార్

రాజకీయాల్లోకి వచ్చే క్రికెటర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా భారత క్రికెటర్ ప్రవీణ్ కుమార్ రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సమాజ్ వాది పార్టీ (ఎస్పీ)లో చేరారు.

రాజకీయాల్లోకి వచ్చే క్రికెటర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా భారత క్రికెటర్ ప్రవీణ్ కుమార్ రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సమాజ్ వాది పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఆదివారం లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్వయంగా ప్రవీణ్ కుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
 
ఇదిలావుండగా, భారత క్రికెట్ జట్టు తరపున ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు 6 టెస్టులు, 68 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 27 వికెట్లు, వన్డేల్లో 77 వికెట్లు తీసుకున్నాడు. వీటితో పాటు 10 ట్వంటీ మ్యాచ్‌లు కూడా ఆడిన పేస్ బౌలర్ ప్రవీణ్ కుమార్, 8 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.