గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 జులై 2016 (12:55 IST)

పాంటింగ్ వ్యాఖ్యల్ని తప్పుబట్టిన వార్నర్: బ్యాట్ల బరువుకు బౌలర్లకు లింకు లేదు!

ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తప్పుపట్టాడు. అంతర్జాతీయ టెస్టు ఫార్మాట్‌లో బరువు, మందం కలిగిన బ్యాట్లపై ఆంక్షలు విధించాలంటూ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యల

ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తప్పుపట్టాడు. అంతర్జాతీయ టెస్టు ఫార్మాట్‌లో బరువు, మందం కలిగిన బ్యాట్లపై ఆంక్షలు విధించాలంటూ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై వార్నర్ స్పందించాడు. టెస్టు క్రికెట్లో బౌలర్లు రాణించకపోవడానికి కారణం బ్యాట్లు కాదన్నాడు. బ్యాటింగ్ పిచ్‌లను రూపొందించడమే రాణించేందుకు కారణమని చెప్పుకొచ్చాడు. 
 
బౌలర్లకు అనుగుణమైన పిచ్‌లు రూపొందిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని తెలిపాడు. ఫ్లాట్ పిచ్‌లపై బ్యాట్స్ మన్ వీరవిహారం చేస్తుంటారని, గత కొన్ని టెస్టులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని వార్నర్ వెల్లడించాడు. బ్యాట్ల బరువు, మందానికి బౌలర్లు విఫలమవ్వడానికి లింకు లేదని వార్నర్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అధిక బరువు, అత్యధిక మందం గల బ్యాట్లను నిషేధించాలంటూ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.