శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 23 ఆగస్టు 2015 (12:43 IST)

దావూద్‌కు ఆశ్రయం ఇస్తూనే.. క్రికెట్ ఆడాలని పిలుస్తారా? బీసీసీఐ ప్రశ్న

ముంబై వరుస పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చినట్లు ఆధారాలతో తేలిపోవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది.

దావూద్‌కు ఆశ్రయం ఇవ్వడం నిలిపివేసే వరకు పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ ఉండదని బీసీసీఐ అనురాగ్ ఠాకూర్ తెగేసి చెప్పేశారు. దావూద్‌కు ఆశ్రయమిస్తూనే.. క్రికెట్ ఆడేందుకు రావాల్సిందిగా ఎలా పిలుస్తారని పీసీబీని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. 
 
"దావూద్ ఏమో కరాచీలోనే ఉన్నాడు. ఎన్ఎస్ఏ వేర్పాటువాదులను కలవాలని కోరుకుంటున్నారు. మీరు నిజంగానే శాంతి కోసం పాటుపడుతున్నారా? మీతో క్రికెట్ ఆడతామని ఆశిస్తున్నారా?" అని ట్వీట్ ఠాకూర్ చేశారు.
 
ఇక భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య చర్చల్లో వేర్పాటువాదులకు చోటు కల్పించే ప్రయత్నాలు కూడా పాకిస్థాన్ మానుకోవాల్సిన అవసరముందని ఠాకూర్ స్పష్టం చేశారు. అప్పుడే భారత్, పాకిస్థాన్ సంబంధాలు, క్రికెట్ పునరుద్ధరణపై ఆలోచిస్తామన్నారు.