Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ ఇద్దరి మధ్యా ఆ బంధమున్నంత వరకు టీమిండియాకు తిరుగులేదట..!

హైదరాాబాద్, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (02:32 IST)

Widgets Magazine
kohli  - dhoni

అహంకారం ఏమాత్రం లేని, పరిణతికి మారుపేరుగా నిలిచిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మధ్య సరైన కెమిస్ట్రీ కుదిరితే అద్భుత ఫలితాలు వస్తాయని ఆ మేటి క్రికెటర్లు మరోసారి నిరూపించారు. ఇక మ్యాచ్ చేజారిపోయిందని ఆశలుడిగిన తరుణంలో తన అనుభవమంతా ఉపయోగించి ఒక వికెట్ కీపర్ తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన క్షణంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 రెండో మ్యాచ్‌లో భారత్ విజయాన్ని తన పేరిట లిఖించుకుంది. ధోనీ చివరి రెండు ఓవర్లలో సారధిగా మారిపోయి ఫీల్డింగ్ సెట్ చేస్తున్న తరుణంలో కోహ్లీ లాంగాన్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ ధోనీకి బాధ్యతలు వదిలేయడం ఎవరూ తప్పుపట్టలేదు. పైగా ఆ ఇద్దరి మధ్య అలాంటి సాన్నిహిత్యం, అహాలను దూరంపెట్టిన వ్యక్తిత్వం ఇదేవిధంగా కొనసాగాలని యావత్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
 
ఇంగ్లండ్‌తో రెండో మ్యాచ్ లోనే అనికాదు.. ధోనీ కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత కోహ్లీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం వాస్తవమే కావచ్చు కానీ మ్యాచ్‌‌ ఉత్కంఠ స్థితికి చేరుకుంటున్న ప్రతి సందర్భంలోనూ ధోనీ కెప్టెన్‌గా మారిపోతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన సమయంలో ధోనీ తన అనుభవాన్ని ఉపయోగించాడు. సారధిగా మారిపోయి ఫీల్డింగ్ సెట్ చేశాడు. అటు నెహ్రా, ఇటు బూమ్రాలతో మాట్లాడుతూ పలు సూచనలిస్తూ కనిపించాడు. 
 
ఆ సమయంలో అసలు కెప్టెన్ కోహ్లీ లాంగాన్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే ఒత్తిడి ఎక్కువగా ఉండే చివరి ఓవర్లలో తనకున్న అనుభవం మొత్తాన్ని ఉపయోగిస్తుండటంతో కోహ్లీ కూడా ధోనీకి మద్దతుగా కొంత సైలెంట్ అయిపోతున్నాడు. తనకు ధోనీనే ఎప్పుడూ కెప్టెన్ అని కోహ్లీ గతంలో అన్నాడు. అదేవిధంగా కోహ్లీకి తాను సహకరిస్తానని ధోనీ చెప్పిన సంగతి తెలిసిందే.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఆ మ్యాచ్ గనుక కోల్పోయి ఉంటే అందరూ నామీదే పడేవారు: ఆశిష్ నెహ్రా

టీమిండియా జట్టు విజయాల బాటలో నడుస్తున్నంత కాలం తన వయస్సూ, అనుభవం గురించి ఎవరికీ ఎలాంటి ...

news

ధోనీని ఉపయోగించుకో కోహ్లీ.. అతనికి ప్రమోషన్ ఇవ్వు.. లేకుంటే నష్టమే: గంగూలీ

బెంగళూరులో బుధవారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు ...

news

వెయిటర్ ఇచ్చిన సలహాను స్వీకరించా.. మోచేతి గార్డును మార్చుకున్నా..

ప్రపంచం మొత్తానికి బ్యాటింగ్ పాఠాలు చెప్పే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ హోటల్ ...

news

అవకాశమిస్తే చాలు ఆసీస్ అమాంతంగా కబళించేస్తుంది: టీమిండియాకు సచిన్ వార్నింగ్

త్వరలో ఆస్ట్రేలియా పర్యటించనున్న భారత్ క్రికెట్ జట్టుకు క్రికెట్ దిగ్గజం సచిన్ తీవ్రంగా ...

Widgets Magazine