శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 మే 2015 (16:54 IST)

ధోనీ నాయకత్వం అంటే నాకెంతో ఇష్టం : వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆరుసార్లు ఫైనల్స్‌కు చేర్చిన మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంపై వెస్టిండీస్ వన్డే కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. ధోనీ నాయకత్వం అంటే తనకెంతో ఇష్టమన్నాడు.

‘ధోనీ ఒక ప్రభావవంతమైన వ్యక్తి. అద్భుతమైన సమయస్ఫూర్తి అతని సొంతం. ఒక జట్టు కెప్టెన్‌గా నాకు ధోనీయే రోల్‌ మోడల్‌. వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లందరినీ ఒక్క తాటి పైకి తెచ్చి విజయాలు సాధించడం సాధారణ విషయం కాదు. మ్యాచ్‌లో ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవడంలో ధోనీ సామర్థ్యం అసాధారణమ'ని హోల్డర్‌ వెల్లడించారు. 
 
23 ఏళ్ల జాసన్ హోల్డర్ ప్రస్తుతం వెస్టిండిస్ జట్టుకి వన్డే కెప్టెన్‌గా ఉన్నారు. 2014 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు హోల్డర్ ప్రాతినిధ్యం వహించాడు‌. అయితే ఈ ఏడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఉండటం వల్ల ఐపీఎల్‌కు దూరమయ్యాడు. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా డ్వేన్ స్మిత్‌ను తొలగించి వెస్టిండిస్ కెప్టెన్‌‌గా జాసన్ హోల్డర్‌ని బోర్డు నియమించింది.
 
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో జాసన్ హోల్డర్ బార్బడోస్ ట్రైడెండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జూన్ 3 నుంచి ఆస్టేలియాతో జరగనున్న టెస్టు సిరిస్‌పైనే తన దృష్టంతా ఉందని పేర్కొన్నాడు. వచ్చే నెలలో ఆస్టేలియా, వెస్టిండిస్‌లో పర్యటించనుంది.